దోషికి శిక్ష పడే వరకు జనసేన పోరాడుతుంది : పవన్ కల్యాణ్
సైదాబాద్‌లో ఆరేళ్లబాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలచివేసింది. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి ఈ సమయంలో ఓదార్పు అవసరం. దోషికి శిక్ష పడే వరకు జనసేన పోరాడుతుంది. బాలిక తల్లిదండ్రులు రాజుపై ముందే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా స్పందించలేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు అని పవన్ తెలిపారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిరచాలన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి సహాయం, ఓదార్పు అందించాలన్నారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే ఆలోచించి చేయాలని అన్నారు.













