Ustaad Bhagath Singh: పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జూన్‌లో ప్రారంభం

మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, (Pawan Kalyan)బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagath Singh) జూన్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై (Mythri Movie Makers)నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కంప్లీట్ రీలోడెడ్, రీ ఇమాజిన్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ అవతార్ లో అలరించబోతున్నారు. ఇది అభిమానులకే కాదు, యావత్ ప్రేక్షకులకు హై-ఓక్టేన్ కథనంతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నాగ మహేశ్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, యంగ్ డైనమైట్ ఉజ్వల్ కుల్కర్నీ ఎడిటర్. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే క.దశరథ్, రమేష్ రెడ్డి అందిస్తున్నారు, ప్రవీణ్ వర్మ, చంద్రమోహన్ అడిషినల్ రైటర్స్. ప్రొడక్షన్ డిజైన్‌ను అవార్డ్ విన్నింగ్ ఆనంద్ సాయి అందిస్తున్నారు.