పవన్ తర్వాత సినిమాలు చేయడా?
2024 ఎలక్షన్స్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని అందుకున్నారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కీలకపాత్ర పోషించాడు. 2024 ఎలక్షన్స్ లో పవన్ గేమ్ ఛేంజర్ గా ఉన్నాడని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో పవన్ కీలక పాత్ర పోషించనున్నాడనే మాట వినిపిస్తుంది. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకి రాని విధంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ తో రికార్డు విజాయన్ని దక్కించుకుంది. పవన్ భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరినీ గెలిపించుకున్నాడు. ఈ గెలుపుని బాధ్యతగా తీసుకుని ప్రజలకిచ్చిన హామీలని నెరవేరుస్తానని పవన్ ఇప్పటికే చెప్పాడు.
అది జరగాలంటే పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలను కుదిరినంత త్వరగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. కుదిరితే ఈ ఏడాదిలోనే పవన్ మూడు సినిమాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత పరిపాలనలో భాగం కావాలని చూస్తున్నాడట. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది కాకుండా మరో రెండు కథలను త్రివిక్రమ్ విని పవన్ కోసం రెడీగా ఉంచాడని తెలుస్తోంది.
మరి ఈ మూడు సినిమాల తర్వాత పవన్ సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ సైతం ఈ టైమ్ లో పవన్ నుంచి సినిమాలు రావాలనుకోవడం లేదు. ఆయన ఫ్యాన్స్ కూడా పవన్ పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగానే ఉండాలనుకుంటున్నారు. ఇప్పటినుంచి పవన్ దృష్టి పెడితే 2029 ఎలక్షన్స్ టైమ్ కు రాజకీయ పరంగా ఇంకా బలమైన పార్టీ అవుతుందని, ఈ లోగా ఖాళీ ఉంటే అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేసినా చాలని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













