ఉక్కిరిబిక్కిరవుతున్న పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఎగ్జటవుతున్నారు. పాతికేళ్లకు పైగా ఎప్పుడూ తన కెరీర్లో చూపించని వేగం ఇప్పుడు చూపిస్తున్నాడు. పవన్ ఇన్నేళ్లలో ఎప్పుడూ ఒకేసారి రెండు సినిమాల్లో నటించింది లేదు. ఓ సినిమాకు ఇంకో సినిమాకు మినిమం సంవత్సరం గ్యాప్ తీసుకునేవాడు.
స్టార్ హీరోలంతా గ్యాప్ లేకుండా నటిస్తుంటే పవన్ మాత్రం తాపీగా సినిమాలు చేయడం ఫ్యాన్స్‌కి రుచించేది కాదు. ఇక పాలిటిక్స్ వచ్చేశాక పవన్ మరింత స్పీడ్ తగ్గించాడు. ఒక దశలో సినిమాలకు దూరం కూడా అయ్యాడు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చాక కూడా కొంచెం నెమ్మదిగానే వ్యవహరిస్తాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ మధ్య పవన్ ఉన్నట్లుండి స్పీడ్ పెంచేశాడు. ఆ స్పీడు సూపర్ ఫాస్ట్ రేంజిలో ఉండటంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న హరిహర వీరమల్లు సినిమా కోసం కొన్ని వారాల పాటూ విరామం లేకుండా షూటింగ్‌కు హాజరై, కీలక సన్నివేశాలు కంప్లీట్ చేశాడు. తర్వాత జస్ట్ 20 డేస్‌లోనే డేట్లు ఇచ్చి వినోదాయ సీతం రీమేక్ లో తన పని మొత్తం అవగొట్టేశాడు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్‌సింగ్‌ను కూడా పట్టాలెక్కించాడు. తొలి షెడ్యూల్ ఏ ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చేశాడు. ఆఖరికి సుజీత్ దర్శకత్వంలో ఓజీని కూడా స్టార్ట్ చేశాడు.
హరీష్ శంకర్ అనగానే పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. అతడితో మళ్లీ సినిమాను మొదలుపెట్టి ఓ షెడ్యూల్ కూడా ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ చేశాడు. హరీష్ లాగే పవన్ అభిమానే అయిన సుజీత్ తీసే సినిమా విషయంలోనూ ఫ్యాన్స్ కు చాలా అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచేలా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమోతో సుజీత్ తన మార్కు చూపించాడు. ఇలా వరుసబెట్టి అప్డేట్లను, ఈ ఆనందాన్ని పవన్ ఫ్యాన్స్ తట్టుకోలకపోతున్నారు.













