నేను రెడీ.. మీరు కూడా రెడీయేనా? ప్రశ్నిస్తున్న పవన్‌కల్యాణ్
కరోనా కారణంగా షూటింగులను నిలిపివేయడంతో ఎన్నో సినిమాలు సగం పూర్తయినవి కొన్ని, పూర్తి కావచ్చినవి కొన్ని.. ఇలా రకరకాల దశల్లో సినిమాలు నిలిచిపోయి ఉన్నాయి. వాటిలో పవన్‌కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్‌సాబ్`. ఈ సినిమా ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేద్దామనుకునే లోపే కరోనా వచ్చి పడింది. ఇక చేసేది లేక షూటింగ్‌ను నిలిపివేశారు.
షూటింగులకు అనుమతులు ఇచ్చిన తర్వాత తన సినిమా షూటింగ్ గురించి ఏమీ మాట్లాడని పవన్ ఇప్పుడు తాను షూటింగ్‌కి సిద్ధం అనే సిగ్నల్స్ ఇస్తున్నాడు. వకీల్‌సాబ్ త్వరగా పూర్తి చేసేస్తే క్రిష్ సినిమా సెట్స్‌కి వెళ్లిపోవచ్చని పవన్ భావిస్తున్నాడు. కానీ, వకీల్‌సాబ్ యూనిట్ మాత్రం షూటింగ్‌కి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ విషయంలో దిల్‌రాజు, వేణు శ్రీరామ్ కూడా స్పందించడం లేదు. ఈ సినిమా పూర్తి చేసేస్తే క్రిష్‌తో చేసే సినిమా కాస్త లేట్ అయినా ఫర్వాలేదన్నది పవన్ ఆలోచన. అయితే అందరూ ఓకే అనుకొని షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఎవరికైనా కరోనా సోకితే అప్పుడు యూనిట్ మొత్తం అప్సెట్ అవుతుంది. కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో షూటింగ్‌కి వెళ్లకపోవడమే కరెక్ట్ అని యూనిట్ భావిస్తోంది.
పవన్ షూటింగ్‌కి రెడీ అని చెప్పినా.. యూనిట్లో ఒక్కరికి కరోనా వచ్చినా అందరితోపాటు పవన్ కూడా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందుకే షూటింగ్ చేసేందుకు ఎవరూ సుముఖంగా లేరు.













