రెండు మల్టీస్టారర్స్‌కి ఓకే చెప్పిన పవన్‌కల్యాణ్?
పవన్‌కల్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `వకీల్‌సాబ్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో `విరూపాక్ష` చేస్తున్నాడు. అలాగే హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలు ఇలా ఉండగానే మరో రెండు రీమేక్‌లు చేసేందుకు పవన్‌కల్యాణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి మలయాళంలో పృథ్విరాజ్ హీరోగా నటించిన సూపర్‌హిట్ మూవీ `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను రామ్‌చరణ్ సొంతం చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తాడని సమాచారం. రెండో సినిమా తమిళ్లో సూపర్‌హిట్ అయిన `విక్రమ్ వేద`. ఈ సినిమాను తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చెయ్యబోతోంది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌తో కలిసి రవితేజ నటించనున్నాడు. ఈ సినిమా గురించి విజయదశమికి అధికారికంగా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. తమిళ్లో మాధవన్, విజయ్‌సేతుపతి నటించిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించే అవకాశం ఉంది.













