ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్
ఇటీవల జై లవకుశ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఎన్టిఆర్ కొత్త చిత్రం ప్రారంభమైంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పాల్గొని ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం విశేషం. తొలి సన్నివేశానికి త్రివిక్రమ్ దర్శకత్వం చేయగా ఎన్టిఆర్ దేవుడి పటాలకు నమస్కరిస్తుండగా సినిమా షూటింగ్ మొదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నం.5గా ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.













