బందిపోటు పాత్రలో పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంది. కానీ అనూహ్యంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో దేశ వ్యాప్తంగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. వకీల్ సాబ్ సినిమాతో పాటు పవన్ మరో చిత్రాన్ని అంగీకరించారు. క్రిష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఇందులో పవన్ ద్విపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. రెండు కూడా వైవిధ్యమైన పాత్రలే. వీటిలో ఒకటి బందిపోటు పాత్రని తెలిసింది. దీనిపై అధికారిక సమచారం వస్తే కానీ అసలు విషయం తెలియదు.













