క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ మూవీలో నటిస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, పవన్ చేయనున్న తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే దిశగా పనులను జరుపుకుంటోంది. మొఘల్ చక్రవర్తుల పాలనా కాలంలో ఈ కథ నడుస్తుంది. అందుకే ఆ కాలం నాటి సెట్స్ ను భారీగా వేస్తున్నారు. ఇందుకోసం నిర్మాత ఎ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ ను కేటాయించారంట. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ కెరియర్ లో ఇది తొలి చారిత్రక చిత్రం అవుతుందని చిత్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు.













