లిమిట్స్ దాటుతున్న ఓజీ హైప్
స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలకైతే ఆ రచ్చ మరికొంచెం ఎక్కువగా ఉంటుంది. మూడు రీమేక్స్ తర్వాత పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న స్ట్రయిట్ మూవీ ఓజీ. స్ట్రయిట్ సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ కథలు కథలుగా చెప్పుకుంటూ హైప్ పెంచేస్తున్నారు. రెగ్యులర్ గా సినిమా గురించి ట్వీట్స్ చేస్తూ, ఓజీ టీజర్ చూసి చచ్చిపోయినా పర్లేదనుకునే స్టేజ్ కి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో. అయితే పవన్ బర్త్ డే సందర్భంగా రానున్న ఓజ టీజర్ నిడివి కేవలం 70 సెకన్లు మాత్రమే అని తెలుస్తోంది.
టైటిల్ కార్డ్, ఇంట్రో, ఎండ్ క్రెడిట్స్ తో పాటూ రెండు పవర్ ఫుల్ షాట్స్ తో కలిపి ఈ నిడివి అని సమాచారం. అంతేకాదు ఈ టీజర్ లో పవన్ డైలాగ్ కూడా ఉండదట. కేవలం అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ లో ఎలివేషన్స్ ఇచ్చేలా ఈ టీజర్‌ను ప్లాన్ చేశాడట డైరెక్టర్ సుజీత్. ఇవన్నీ తెలిసి కూడా పవన్ ఫ్యాన్స్ టీజర్ గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా డేంజరే. ఎందుకంటే టీజర్ ఏ మాత్రం ఫ్యాన్స్ కు ఎక్కకపోయినా ఇప్పుడు హంగామా చేస్తున్న ఫ్యాన్సే ట్రోల్ చేస్తారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా పూర్తి కాలేదు కాబట్టి షూటింగ్ అయిన ఫుటేష్ లో నుంచి బెస్ట్ షార్ట్స్ ను టీజర్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట సుజీత్. థమన్ కూడా బీజీఎం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది వేసవిలో ఉండే అవకాశం ఉంది.













