ఓజి సరే.. వీరమల్లు ఎప్పుడు పవన్ సార్?
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సెటిల్ అయిపోయారు. పదవి చేపట్టి ఇప్పటికే మూడు నెలలవుతోంది. ఇప్పుడు పవన్ అటు రాజకీయాలతో పాటూ ఇటు తను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే పవన్ బ్యాక్ టు బ్యాక్ సెట్స్ లోకి రానున్నాడు.
ఇప్పటికే పవన్ ఓజి సినిమా కోసం డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. గ్యాప్ తీసుకోకుండా పవన్ కొద్ది రోజుల పాటూ డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు తగిన టైమ్ తీసుకుని రిలీజ్ కు ప్లాన్ చేసుకునే ఉంటుంది. ఇదిలా ఉంటే పవన్ ను ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కూడా కలిసింది. పవన్ డేట్స్ తదితర అంశాలపై టీమ్ చర్చించిందట.
దానికి పవన్ దానికంటే ముందు వీరమల్లు పూర్తి చేయాలని వారి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ఉస్తాద్ భగత్‌సింగ్ టీమ్ తో పాటూ వీరమల్లు టీమ్ కూడా పవన్ ను డేట్స్ విషయమై కలిసింది. ఓజితో పాటూ హరిహర వీరమల్లు సినిమాకు కూడా డేట్స్ ఇవ్వాలని చిత్ర యూనిట్ కోరినట్లు సమాచారం. దానికి పవన్ కూడా సానుకూలంగానే స్పందించారట. కానీ వీరమల్లుకి పవన్ డేట్స్ ఎప్పటినుంచి ఇచ్చారనేది మాత్రం తెలియాల్సి ఉంది. వాస్తవానికి పవన్ కమిట్ అయిన సినిమాలన్నింటిలో కెల్లా ముందు ఒప్పుకుంది వీరమల్లునే. కానీ పెద్ద ప్రాజెక్ట్ అవడంతో రిలీజ్ కు ఎక్కువ టైమ్ పడుతుందని ఈలోగా ఓజిని పట్టాలెక్కించారు. ఆ తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల పవన్ ఒప్పుకున్న సినిమాలన్నీ రిలీజ్ వాయిదాలు పడ్డాయి.













