పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కి బిజినెస్ పరంగా ఫుల్ క్రేజ్
పాపులర్ హీరోకి ఒక్క సినిమా ప్లాప్ అయినా తర్వాత వచ్చే సినిమా హిట్టు కొట్టాల్సిందే..అదే హీరోకి వరుసగా ప్లాపులు వస్తుంటే చిన్నగా ఆ హీరో క్రేజ్ కూడా తగ్గుతుంది. కానీ పవర్ స్టార్ కు మాత్రం అలా కాదు హిట్టు కొట్టినా కొట్టకపోయినా క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది.. ఉంది. గడచినా దశకం లో ఇప్పటి వరకు 10 సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో బ్లాక్ బస్టర్ మూవీస్ గా గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది? ఈ రెండు సినిమాలు తప్పించి మిగతావన్నీ యావరేజ్ మరియు ప్లాప్ సినిమాలే అయితే నేమ్…. పవర్ స్టార్ పవర్ ఏ మాత్రం తగ్గలేదు ఏ సినిమాకా సినిమా రికార్డు ఓపెనింగ్స్ తో పవన్ కళ్యాణ్ చిత్రాలు విడుదల అవుతుంటాయి.
పవన్ మీద ఉన్న ఫ్యాన్స్ అభిమానం ఇసుమంతైనా తగ్గలేదని చెప్పాలి. అతని ప్రతీ మూవీ అన్నౌసెమెంట్ నుండి టీజర్ నుండి సినిమా విడుదల వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన సినిమాల వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పదేళ్ల కాలం లో గబ్బర్ సింగ్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్ ఆ వెంటనే అత్తారింటికి దారేది సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు ఆ సినిమా ఫస్ట్ హాఫ్ లీక్ అయినా కూడా సినిమా సూపర్ హిట్ అవడం విశేషం.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంతో షూటింగ్ నిలిచిపోయిన ‘వకీల్ సాబ్’ కి సినీ ట్రేడ్ నుండి మంచి ఫాన్సీ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి ‘మగువా మగువా’ అనే సాంగ్ పాపులర్ అయ్యి కూర్చుంది. అతనికున్న క్రెజ్ అలాంటిది అని వేరే చెప్పాలా.













