వీరమల్లు లేటెస్ట్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు వీడియో గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. దీంతో వీరమల్లు మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరలోనే పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 27 నుంచి వారం పది రోజుల పాటు పవన్ హరిహర వీరమల్లులో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. దీని కోసం ముంబై నుంచి శిక్షణ పొందిన వంద మంది ఫైటర్స్ వచ్చారట. ఇప్పటికే వారితో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. పవన్ కూడా 27 నుంచి జాయిన్ అయ్యి వారితో తలపడనున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఎఎం రత్నం నిర్మిస్తుండగా, పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటింనుంది. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.













