రీరిలీజ్ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్
టాలీవుడ్లో ఈ మధ్య రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటూ, ఓ మోస్తరు సినిమాలను ఆఖరికి ఫ్లాప్ అయిన సినిమాలను కూడా స్పెషల్ షో లుగా వేసి పెద్ద రిలీజ్ టైప్‌లో చేస్తున్నారు. ఆ షో ల టికెట్లు కూడా బాగా సేల్ అవుతున్నాయి. గతేడాది పోకిరితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, ఖుషి సినిమాల రీరిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చ చేశారు. ఇప్పుడు పవన్ హీరోగా తెరకెక్కిన మరో సినిమాను రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ సినిమానే గుడుంబా శంకర్. జానీ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయ్యాక పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ చేసిన ఈ సినిమా, 2004లో భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ గుడుంబా శంకర్ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.
గుడుంబా శంకర్ లో పవన్ లుక్స్, ఫైట్స్, సాంగ్స్, ఫైట్స్ అన్నింటికీ అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. కథకు ఇంకాస్త పదును పెట్టినట్లైతే మంచి హిట్ అయ్యేదని ఫ్యాన్స్ ఇప్పటికీ అనుకుంటారు. అలాంటి గుడుంబా శంకర్ ను సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రీరిలీజే విడ్డూరం అనుకుంటే ఈ రీరిలీజ్ కు మళ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారట ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు.
ఈ ఈవెంట్‌కు సినిమా డైరెక్టర్ వీర శంకర్‌తో పాటూ, టెక్నీషియన్లు, పవన్ ను అభిమానించే కొందరు హీరోలు కూడా హాజరు కానున్నారట. ఫ్యాన్స్ మూమెంట్స్ కు ఢోకా లేని ఈ మూవీ స్పెషల్ షో రికార్డులను తిరగరాస్తుందేమో అనుకునే రీతిలో ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారట.













