భవదీయుడు భగత్‌సింగ్ ఫస్ట్ లుక్ విడుదల
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి భవదీయుడు భగత్‌సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ విలాసవంతమైన బైక్‌పై కూర్చొని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఓ చేతిలో టీ గ్లాస్, మరో చేతిలో స్పీకర్ పట్టుకుని ఉన్నారు. ప్రచార చిత్రంపై ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని పేర్కొనడాన్ని బట్టి ఈసారి వినోదంతో పాటు ఓ చక్కని సందేశాన్ని అందించనున్నట్లు అర్థమవుతోంది. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, కూర్పు: చోటా కె ప్రసాద్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, ఛాయాగ్రహణం: అయనాంక బోస్.













