పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకొనేందుకు ఇంకో రెండు వారాలు పట్టొచ్చు

ఫామ్ హౌస్‌లోనే విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్ల సలహా
ఇటీవల ‘వకీల్‌సాబ్’ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన కరోనా బారిన పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొన్ని రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్న తర్వాత పవన్ వైరస్ నుంచి కోలుకున్నారు. కానీ, ఆయన ఇంకా అనారోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగా ఉంది. పలువురు సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకోగా. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. ఇక తమ వ్యక్తిగత సిబ్బందిలో కొందరు వైరస్ బారిన పడటంతో స్టార్లు ముందు జాగ్రత్త చర్యగా తమని తాము ఐసోలేట్ చేసుకుంటున్నారు. తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయితే ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా.. ఆయనకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన తన ఫామ్ హౌస్‌లో ఉంటూనే చికిత్స తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆయనకు మళ్లీ పరీక్షలు నిర్వహించగా.. ఫలితం నెగటివ్ అని వచ్చింది.
అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. పవన్ ఇంకా అనారోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయన తన ఫామ్ హౌస్‌లోనే ఉండాలని, బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచించారు. మళ్లీ ఆయన ఆరోగ్యం మునుపటిలా మారడానికి మరో రెండు వారాల సమయం అయినా పడుతుందని వైద్యులు చెబుతున్నారు.