ఖుషి2ని రిజెక్ట్ చేసిన పవన్
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఖుషి సినిమాను తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. రీమేక్ సినిమానే అయినప్పటికీ ఈ సినిమాను తెలుగులో స్టైలిష్ గా తీర్చిదిద్ది దాన్ని బ్లాక్బస్టర్ చేసింది మాత్రం ఎస్జె సూర్య, పవన్ జోడీనే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీయడంపై రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది.
సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక ఖుషికి సీక్వెల్ తీయాలని అది కూడా పవన్ తోనే చేయాలని డైరెక్టర్ సూర్య ను అడిగింది. అయితే సూర్య ఇప్పటికే ఖుషి సీక్వెల్ ను తెలుగులోనే తీయాలనుకున్నట్లు, ఆ స్క్రిప్ట్ ను ఇప్పటికే పవన్ కు వినిపించినట్లు కూడా తెలిపాడు. కానీ పవన్ ఖుషి2ని రిజెక్ట్ చేసినట్లు సూర్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఖుషి2 స్టోరీ ఇప్పటికీ పవన్ దగ్గరే ఉందని సూర్య తెలిపాడు. ఈ కథ చెప్పినప్పుడు పవన్ కు నచ్చిందని, నరేషన్ ను కూడా బాగా ఎంజాయ్ చేశారని సూర్య వెల్లడించాడు. కానీ అప్పటికే తాను లవ్ స్టోరీలు చేసే వయసు దాటిపోయానని కాబట్టి ఖుషి2 చేయలేనని పవన్ తేల్చేసినట్లు చెప్పాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి నటులు వయసు పెరిగిన తర్వాత కూడా లవ్ స్టోరీలు చేశారని పవన్ కు గుర్తు చేస్తే తాను మాత్రం ఈ సినిమా చేయలేనంటే చేయలేనని పవన్ చెప్పేసినట్లు సూర్య వెల్లడించాడు.













