ఓజీలో పవన్ ఇంట్రోకి గూస్బంప్స్ గ్యారెంటీ
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు షూటింగ్ కావాల్సిన సినిమాలున్నాయి. వాటిలో ఫ్యాన్స్ అందరి దృష్టి ఓజీ మీదే ఉంది. ఈ సినిమాపై వారికి విపరీతమైన అంచనాలున్నాయి. హరిహరవీరమల్లు అసలెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియక దాని మీద ఆశలు వదిలేసుకున్న పవన్ ఫ్యాన్స్, ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాబట్టి పెద్దగా హోప్స్ పెట్టుకోవడం లేదు. దీంతో అందరి దృష్టి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ మీదే ఉంది. ఈ సినిమాను మొదట్లో డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చాయి కానీ ఈ సినిమా డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని తెలుస్తోంది. ఓజీ సినిమాను రెండు పార్ట్ లుగా చేసి మొదటి పార్ట్ ను వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెట్టి అసలు విషయానికొస్తే ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం సుజీత్ రెండు వెర్షన్లు రాసుకున్నాడట. అందులో ఒక వెర్షన్ 15 నిమిషాల నిడివితో విపరీతమైన రక్తపాతంతో కూడిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. పవన్ కు ఈ వెర్షన్ బాగా నచ్చడంతో దీన్నే మునుపెన్నడూ చూడని విధంగా సుజీత్ ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నాడట.
ఆ పదిహేను నిమిషాలు ప్రతి ఫ్రేమ్ లో గూస్ బంప్స్ రావడం ఖాయమని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాను సుజీత్ చాలా కేర్ తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. థమన్ కూడా ఈ సినిమాకు చాలా బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడని, బ్రో సినిమాతో వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ను ఈ సినిమాతో తొలగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా టీజర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.













