పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేస్తున్న దర్శకుడు పరుశురామ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుస సినిమాలతో బిజీగా పవన్ పొలిటికల్, మూవీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఓ డైరెక్టర్ కోసం ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. పరశురామ్. చైతన్య సినిమా స్టార్ట్ కావటానికి సమయం పట్టేలా ఉండటంతో ..గ్యాప్‌లో పవన్ కోసం పరశురామ్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఆయన హరి హర వీర మల్లు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత తమిళ చిత్రం వినోదయ సిత్తం రీమేక్‌ను కంప్లీట్ చేస్తారు. మరో వైపు హరీష్ శంకర్ కూడా భవదీయుడు భగత్సింగ్సినిమాను పూర్తి చేయటానికి రెడీ ఉన్నారు. వీటితోనే ఆయన బిజీగా ఉంటే, పవన్ పొలిటికల్, మూవీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఓ డైరెక్టర్ కోసం ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. పరశురామ్.
రీసెంట్గా సూపర్‌స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కించిన పరశురామ్ .తదుపరి మూవీని నాగచైతన్యతో చేయాల్సి ఉంది. నాగేశ్వరరావు పేరుతో ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసుకున్నారు పరశురామ్. అయితే నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా ట్రాక్ ఎక్కటానికి సమయం పట్టేలా ఉంది. దీంతో వచ్చిన ఖాళీ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని అనుకున్నారేమో..పవన్ కోసం ఓ స్టోరిని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారట ఈ డైరెక్టర్.సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దగ్గర పవన్ కళ్యాణ్ డేట్స్ ఉన్నాయి. అలాగే ఇదే నిర్మాతతో ఓ సినిమా చేయడానికి పరశురామ్ ఓకే చెప్పేశాడట. దీంతో ఆయన కథను ప్రిపేర్ చేస్తున్నారట. అంతా ఓకే అయితే పవన్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఇదే అవుతుంది. పవన్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ కాంబినేషన్లో అత్తారింటికి దారేది సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.













