HHVM: వీరమల్లు ట్రైలర్ కు ఇంప్రెస్ అయిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు(harihara veeramallu) ఒకటి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కరోనాకు ముందు మొదలైనా ఇంకా రిలీజవలేదు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న వీరమల్లు జులై 24న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయనుంది. అందులో భాగంగానే మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
జులై 3న వీరమల్లు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు వీరమల్లు ట్రైలర్ కు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. వీరమల్లు ట్రైలర్ కట్ ఇప్పటికే పూర్తైందని, కట్ చేసిన ట్రైలర్ ను పవన్ కు చూపించగా, ఆ ట్రైలర్ తో పవన్ కూడా ఇంప్రెస్ అయ్యి, ట్రైలర్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పవన్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న కావడం మరియు పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తోన్న మూవీ కావడంతో వీరమల్లు ట్రైలర్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా నటించగా, ఏఎం రత్నం(AM Ratnam) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.