పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్… ఆందోళనలో ఫాన్స్
మన దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్ అందరికి సోకుతోంది. ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను.. ఉన్నతాధికారులను ఇలా ఎవ్వరు దొరికితే వాళ్లు అనే తరహాలో కరోనా వైరస్ సోకింది. ఇది ఇలా ఉంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ ముందుజాగ్రత్తలో భాగంగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా ఆయన క్వారంటైన్ లో ఉంటున్నారు. అయితే తాజాగా పవన్ పరిస్థితి కాస్త విషమించినట్లు సమాచారం. పవన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తేలింది. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న బండ్ల గణేష్, దిల్ రాజ్ కు కరోనా సోకింది.













