‘గబ్బర్‌సింగ్’తో మరోసారి!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలోని పాటలు, పవన్‌కల్యాణ్ డైలాగ్స్ బాగా పాపుర్ అయ్యాయి. ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా ‘గబ్బర్‌సింగ్’ నిలిచింది. ఇప్పుడు ఇదే టీమ్‌తో మరో భారీ చిత్రం రాబోతోంది. పవన్‌కల్యాణ్ కోసం హరీష్ శంకర్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ని రెడీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సబ్జెక్ట్‌ను పవన్‌కు నేరేట్ చెయ్యబోతున్నాడు. ‘గబ్బర్‌సింగ్’ చిత్రాన్నితన టాప్ సాంగ్స్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిపిన దేవిశ్రీప్రసాద్ మరోసారి పవన్ కోసం టాప్ ట్యూన్స్ ఇవ్వబోతున్నాడు.
ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్‌గా కాస్త వెనకబడ్డ దేవికి ఇది ఓ సువర్ణావకాశమనే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ సినిమా చేసే అవకాశం ఉంది. ఇది పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఉత్సాహం కలిగించే వార్తే. పవన్, హరీష్ ఈసారి ప్రేక్షకుల ముందుకు ఎలాంటి సినిమాతో వస్తారు, ఎంతలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి మరి.













