ప్రపంచాన్ని శాసించే తెలుగు సినిమాలు వస్తాయి…పవన్‌కల్యాణ్
తెలుగుభాషలో ఉన్న అద్భుత సాహిత్యంతో ఎన్నో గొప్ప సినిమాలు తీయొచ్చని, ప్రపంచాన్ని శాసించే సినిమాలు తీయగల సత్తా తెలుగు సాహిత్యానికి ఉన్నదని జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. తెలంగాణ తన గుండెల్లో, రక్తంలో ఉన్నదని, రాజకీయాల కోసం కాకుండా ఇష్టంతో తెలంగాణ గురించి మాట్లాడుతానని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి సంపాదకులుగా వ్యవహరించిన మన సినిమాలు అనుభవాలు-చరిత్ర-పరిణామం అనే పుస్తకాన్ని హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, రావి కొండలరావు, సుద్దాల అశోక్ తేజ్, రెంటాల జయదేవ తదితరులు పాల్గొన్నారు.













