ఆ వార్త కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూపులు
జనవరి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎదురుచూసింది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా కోసమే. సుజిత్, పవన్ ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనే అంచనాలతో రోజురోజుకీ ఆ సినిమాపై హైప్ పెంచేసుకున్నారు. కానీ పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి నిలబడి ప్రచార వేగం పెంచాడో అప్పటినుంచి ఫ్యాన్స్ ఆలోచనలు, ఎదురుచూపులు కూడా మారాయి.
పవన్ గెలుపు ఈసారి తధ్యమని ఇప్పటికే పలు సర్వేలు, నివేదికలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ ఎక్కడా గెలవలేకపోయాడు. కానీ ఈసారి జనసేనానికి గెలుపు నల్లేరు మీద నడకని, కనీసం 80వేల నుంచి లక్ష మెజారిటీతో గెలుస్తాడని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంది ఓజీ కోసం కాదు.
పవన్ గెలిచాడనే వార్త కోసం. ఆ గుడ్ న్యూస్ రావడం లేట్. రాష్ట్రమంతటా సంబరాలు చేసుకునేందుకు జనసేన వర్గాలతో పాటూ పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సుజిత్ మాత్రం పవన్ ఎప్పుడు సెట్స్ లో అడుగుపెడితో అప్పుడు వెంటనే సినిమాను స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అన్ని ప్లాన్ చేసుకుని కూర్చున్నాడు. పవన్ జులై నుంచి మేకప్ వేసుకుంటే సినిమా కచ్ఛితంగా సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యే ఛాన్సుంది. లేదంటే వాయిదా తప్పదు.













