నిరాశలో పవన్ ఫ్యాన్స్ !!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. కొన్ని సంవత్సరాల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ను ప్రేక్షకులు అదే క్రేజ్ తో ఆదరించారు. ఆ తరువాత మళ్ళీ ఏడాది వ్యవధితో ‘భీమ్లా నాయక్’ తో, ఈ ఏడాది ‘బ్రో’ అనే మల్టీస్టారర్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు పవన్.
అయితే రీఎంట్రీ ఇచ్చిన తరువాత పవన్ నటించిన మూడు సినిమాలు రీమేక్ లే. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. తరువాత పవన్ నుండి వచ్చే డైరెక్ట్ కథల కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , హరిహర వీరమల్లు, ఓజీ ఈ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీస్ రిలీజ్ గురించి వివిధ ప్రచారాలున్నా ఇంతవరకు దానికి సంబంధించిన అఫీషియల్ ప్రచారం చిత్ర యూనిట్ నుండి లేదు. దానిలో భాగంగా ఓజీ డిసెంబర్లో , ఉస్తాద్ భగత్ సింగ్ అయితే సంక్రాంతికి అంటూ మాటలు వచ్చాయి , కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఆ ఊసే లేదు. ఇక హరిహర వీరమల్లు అయితే ఎన్నికల లోపే రిలీజ్ కి సిద్ధం చేస్తామంటూ నిర్మాత చెప్పారు. ఈ మూడు చిత్రాలు అనుకున్న ప్రకారం రిలీజ్ అయ్యేటట్లు కనిపించడంలేదు. ఈ మూవీస్ షూటింగ్స్ కూడా కొన్ని నెలల కిందట బ్రేక్ పడింది. ఇక పవన్ ప్రస్తుతం షూటింగ్ కి ఇప్పట్లో అందుబాటులో ఉండరని అర్ధమవుతుంది.
పవన్ ఇటు మూవీస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ తన దృష్టిని మొత్తం రాజకీయాలపైనే పెట్టారు. ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క చిత్రం కూడా వేసవి లోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదట. ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా షూటింగ్స్ కి అటెండ్ అవుతారని సమాచారం. ఈ గ్యాప్ వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ మాత్రమే మిగిలింది అని చెప్పాలి.













