తండ్రి లాగే కొడుకు కూడా సింపులే..
ఫ్యానిజం చేసేది కేవలం తమ అభిమాన హీరోలకే కాదు, వారి పిల్లలకు కూడా. సెలబ్రిటీల పిల్లలు సోషల్ మీడియాలో కనిపిస్తేనే మురిసిపోయే ఫ్యాన్స్ ఉన్న ఈ రోజుల్లో అలాంటిది వారికి నేరుగా వారికి కనబడితే ఎలా ఉంటుంది? రీసెంట్ గా ఈ సీన్ తిరుమతి ఆలయంలో జరిగింది. వాస్తవానికి తమ పిల్లల గురించి బయట పెద్దగా మాట్లాడరు ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చే టైమ్ లో వారే జనాల ముందుకు వస్తారు. కానీ ఇదంతా సోషల్ మీడియా లేనప్పుడు. ఇప్పుడు అందరూ టెక్నాలజీని వాడుకుని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటున్నారు.
ఇప్పుడు ఆ సోషల్ మీడియా ద్వారానే ప్రముఖ టాలీవుడ్ హీరో కొడుకు న్యూస్ లో నిలిచాడు. తను ఎవరో కాదు. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్. తిరుమల దర్శనానికి వెళ్లిన అకిరా కెమెరా కంట పడ్డాడు. అది కూడా తల్లి, చెల్లి తో కలిసి. అంతే కాదు సెలబ్రిటీ లా కాకుండా సాధారణ భక్తుల మాదిరే దర్శనానికి లైన్ లో నిలబడే సరికి అందరూ షాక్ అయ్యారు. తండ్రి లానే కొడుకు కూడా చాలా సింపుల్ గా అందరితో కలిసి దర్శనానికెళ్లడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. కానీ దర్శనమయ్యాక మాత్రం ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. ప్రస్తుతం అకీరా తిరుమల లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













