సైంధవ్ కోసం అప్పుడు చిరూ, ఇప్పుడు పవన్
విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న సినిమా సైంధవ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు.
ఇప్పటికే వెంకటేష్ 75వ సినిమా అవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించిన మేకర్స్ ఆ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. న్యూ ఇయర్ కానుకగా ఈటీవీ విన్ లో ఆ ఈవెంట్ స్ట్రీమింగ్ కాబోతుంది. సైంధవ్ కోసం అప్పుడు చిరంజీవి వస్తే, నెక్ట్స్ వీక్ జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ మరియు వెంకటేష్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం వల్ల వెంకటేషే స్వయంగా పవన్ ను ఈవెంట్ కు హాజరవాలని కోరగా, పవన్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ నిజంగా పవన్, సైంధవ్ ఈవెంట్ కు వస్తే మాత్రం సైంధవ్ కు ఒక్కసారిగా హైప్ పెరగడం ఖాయం.













