పవన్ ఫ్యాన్స్ కు ఈసారి ఫుల్ మీల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు మామూలు జోష్ లో లేరు. వంద శాతం స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు గెలిచి, కూటమి ప్రభుత్వంలో తమ హీరో డిప్యూటీ సీఎం అవడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. దీంతో సెప్టెంబర్ 2న రానున్న పవన్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి బర్త్ డే కాబట్టి ఈసారి గుర్తుండిపోయేలా దాన్ని జరపాలని ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అనే ఎగ్జైట్మెంట్ వారిలో ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఓజి నిర్మాత డీవీవీ దానయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
పవన్ బర్త్ డే కు టీజర్ రిలీజ్ కానుందని చెప్పేశాడు. ఫస్ట్ లిరికల్ కూడా రావొచ్చంటున్నారు. అంతేకాదు ఓజి త్వరలోనే మీ ముందుకొస్తుందని, షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నామని దానయ్య క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు, ఏంటనేది మాత్రం చెప్పలేదు. కాబట్టి మరికొన్నాళ్లు ఈ విషయంలో వెయిటింగ్ తప్పదు. మరోవైపు హరిహర వీరమల్లు నుంచి కూడా సాంగ్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ వచ్చినా రాకపోయినా విషెస్ చెప్తూ పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారు. వీటితో పాటూ గబ్బర సింగ్ ను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి పవన్ బర్త్ డే హడావిడి మామూలుగా ఉండదని అర్థమవుతుంది.













