పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటిసారి హరీష్ చేయిస్తున్నాడు
వకీల్ సాబ్ రూపంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ యే అందింది అని చెప్పాలి. అంచనాలేమి లేకుండా రిలీజ్ అయిన వకీల్ సాబ్ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తున్నాడని తెలిశాక అనౌన్స్ చేసిన సినిమాల్లో ఫ్యాన్స్ ని బాగా ఎక్సైట్ చేసిన ప్రాజెక్ట్ హరీష్ శంకర్ సినిమానే.
ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. మళ్లీ ఆ కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా అది సాధ్యమవడంతో ఫుల్ ఎగ్జయిట్మెంట్ తో ఉన్నారు అభిమానులు. దానికి సంబంధించిన రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ లో వస్తున్న వార్త ఒకటి ఫ్యాన్స్ ను తబ్బిబ్బయ్యేలా చేస్తుంది.
అదేంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. పవన్ కెరీర్ లో ఇప్పటివరకు ద్విపాత్రాభినయం చేసింది లేదు. ఇదే మొదటిసారి. తండ్రీ కొడుకులుగా పవన్ ఈసినిమాలో కనిపించబోతున్నారట. అంతేకాదు ఈ రెండు క్యారెక్టర్లలో ఒకటి పోలీస్ క్యారెక్టరట. గబ్బర్ సింగ్ లో పోలీస్ గా పవన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ హరీష్ డైరక్షన్ లో పవన్ పోలీస్ గా కనిపిస్తాడంటే ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా ఉండదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా, అక్టోబర్ లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం రీమేక్ తో పాటూ, హరిహర వీరమల్లు సినిమాలను ఏకకాలంలో చేస్తున్నాడు.













