కరోనా తర్వాత పవర్ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్
రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దాదాపు మూడేళ్లు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానం అందరికీ కలిగిన టైమ్ లో తన ఆర్థిక అవసరాల కోసమని మళ్లీ సినిమాలను ఎంచుకున్నాడు. దీంతో వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు పవన్.
రీసెంట్ గా పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ లో రానా తో కలిసి నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా పవన్ హరీష్ శంకర్ డైరక్షన్ లో ఒకటి, సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఒక సినిమాను చేస్తున్నాడు.
అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సినిమాలు కాకుండా అనఫిషియల్ గా ఇప్పటికే బండ్ల గణేష్ తో ఒక సినిమాకు పవన్ ఓకే చెప్పాడంటున్నారు. ఇది కాకుండా ఇంకొన్ని సినిమాలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జె. పుల్లారావు నిర్మాణంలో ఒక సినిమా చేసేందుకు పవన్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు ఆ నిర్మాతే స్వయంగా తెలియచేశాడు. పవన్ కోసం కథ రెడీ చేయించామని, ఇప్పుడు పవన్ చేస్తున్న సినిమాలన్నీ అయిపోయాక తమ సినిమాలో నటించడానికి డేట్స్ ఇస్తానన్నట్లు పవన్ చెప్పాడని ఆయన చెప్పుకొచ్చాడు. అవన్నీ పూర్తవాలంటే కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టే ఛాన్సుంది. మొత్తానికి పుల్లారావు బ్యానర్ లో పవన్ చేయబోయే సినిమాతో కలిపి పవన్ మొత్తం అర డజను సినిమాలను లైన్ లో పెట్టాడు. కరోనా బీభత్సం తర్వాత థియేటర్లలో పవన్ సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.













