పసివాడి ప్రాణం పోస్టర్ రిలీజ్ చేసిన సుభాస్ చంద్రబోస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ధన్‌శ్రీ ఆర్ట్స్ నిర్మిస్తున్న పసివాడి ప్రాణం టైటిల్ రిలీజ్ చేశారు. దర్శకనిర్మాత మూర్తి మాట్లాడుతూ టాలీవుడ్లో ఇంతవరకు రానటువంటి వినుత్నమైన లైవ్ కం యూనివేషన్ చిత్రంగా పసివాడి ప్రాణం రూపొందుతోంది. పసివాడి ప్రాణం 90లలో మెగాస్టార్ చిరంజీవిగారు నటించిన సూపర్ హిట్ సినిమా పేరు మా సినిమా పేరు ఒకటే కావటం యాధృచ్ఛికం. కానీ ఆ సినిమాలోని పసివాడిగా నటించి మెప్పించి, ఈనాటి బుల్లితెర
వదినమ్మ ఫేం సుజిత ఈ సినిమాలో అతి ముఖ్యమైన తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు. అల్లువారి వంశం నుండి వచ్చిన యువకుడు అల్లు వంశీని హీరోగా పరిచయం చేస్తున్నాం. అల్లు వంశీ సరసన జంటగా దక్షిణాది తార ఇతి ఆచార్య ను తెలుగు తెరకి పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాలో మరికొన్ని ముఖ్య పాత్రలలలో సాయి, యోగి, రుబినా, ఎఫ్.ఎం బాబాయ్ నటించారు. ఈ సినిమాకి కథప్రాణమైతే ఉపిరి గ్రాఫిక్ వర్క్ అన్నారు.













