‘సూరాపానం’ లో అభినవ పార్వతి
పార్వతి సంప్రదాయాలకు విలువనిచ్చే ఆధునిక అమ్మాయి. తలపై కిరీటం ధరించి చేతిలో గదతో కనిపిస్తున్న ఆమె కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సంపత్‌కుమార్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సూరాపానం. కిక్ అండ్ ఫన్ ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతకాంపై మధుయాదవ్ నిర్మిస్తున్నారు. కథానాయిక ప్రగ్యానయన్ జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పార్వతి అనే యువతిగా గ్లామర్‌తో పాటు అభినయానికి ఆస్కార మున్న పాత్రలో ప్రగ్యానయన్ కనిపిస్తుంది. థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. అజయ్‌ఘోష్, సూర్య, జెన్నీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, సిసిరోలియో, కెమెరా: విజయ్ ఠాగూర్.













