విజయ్ – పరశురామ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఖుషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఖుషి షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న రౌడీ హీరో తన తర్వాతి సినిమాలను పరశురామ్, గౌతమ్ తిన్ననూరితో చేయనున్నాడు. లైగర్ సినిమా ఫలితంతో మొహమాటాలకు పోకుండా కంటెంట్ సూపర్బ్ అనేలా ఉంటేనే చేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడట విజయ్.
అంతే కాదు, విజయ్ ఖుషి తర్వాత చేయబోయే రెండు సినిమాల విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న విజయ్, పరశురామ్‌తో ఈ నెల 12నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
మృణాళ్ తో పాటూ ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి ఆ ఛాన్స్ ఏ హీరోయిన్ ని వరిస్తుందో చూడాలి. ఇప్పటికే విజయ్-పరశురామ్ కాంబోలో గీతా గోవిందం సినిమా రావడంతో వీరి కలయికలో రానున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ యూఎస్‌లో కూడా ఉండనుందట.
అయితే మొదటి షెడ్యూల్ ని మాత్రం హైదరాబాద్ లో స్టార్ట్ చేసి, తర్వాత యూఎస్‌కు వెళ్తారని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలియనుంది. కాగా ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్, కుటుంబరావు అనే టైటిల్స్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.













