ఆ బయోపిక్ నుంచి శ్రద్ధ అవుట్… పరిణీతి ఇన్
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమోల్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్దాకపూర్‌ను టైటిల్ పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమా కోసం శ్రద్దా ఏడాది కాలంగా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తోంది. పుల్లెల గోపీచంద్, సైనాల వద్ద హైదరాబాద్‌లో కొంతకాలం పాటు శిక్షణ తీసుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రద్ధాకపూర్‌ను దర్శననిర్మాతలు తొలగించారని తెలిసింది. ఈ పాత్రలో ఆమె సెట్ కాలేదని తొలగించారట. అయితే శ్రద్ద కపూర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల పలుసార్లు దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించి పరిణితి చోప్రాని నాయికగా ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఇక ఈ సినిమా మళ్లీ మొదటికి వచ్చినట్టే నని అంటున్నారు. అయితే పరిణితి చోప్రాకు కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణనిచ్చిన తర్వాతే మళ్లీ సినిమా షూటింగ్ మొదలుపెడతారట.













