సోషల్‌మీడియాలో తన మరణవార్త కు పరేష్ రావల్ ఫన్నీ కామెంట్ ఏమిటో చూడండి!

సోషల్‌మీడియాలో ఎవరైన ఒక సెలబ్రిటీ లు కొంతకాలం యాక్టీవ్ గా లేకుంటే… వార్తల్లో కనపడకపోయినా చనిపోయారంటూ, వార్తలు రావడయం సోషల్‌మీడియాలో పరిపాటి అయిపొయింది. అందులో ఈ విపత్కర పరిస్థితుల్లో చనిపోయివుంటారులే! అని సోషల్‌మీడియాలో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో వెంపర్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులైతే పట్టించుకోరని సినీ సెలబ్రిటీస్ పై కామెట్స్ పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్‌కి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణ క్షణం, ‘మనీ’, ‘గోవింద గోవింద’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో ఆయన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్నో సినిమాల్లో తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించిన పరేశ్ రావల్‌కు తాజాగా సోషల్‌మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన మరణించాడు అంటూ వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ రావల్ తుదిశ్వాస విడిచారంటూ.. ఆయన ఫోటో పక్కన దీపాలు పెట్టి మరి కొందరు షేర్లు చేశారు. ఆయన మృతికి కొన్ని వేల మంది సంతాపం కూడా తెలిపారు. ఆయన మృతికి సంబంధించిన వార్తలను పలు వెబ్ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అయితే ఈ విషయంపై ఆయన చాలా ఫన్నీగా స్పందించారు. తన మరణవార్తకు సంబంధించిన ఫోటోని ట్వీట్ చేసిన ఆయన.. ‘‘సారీ.. ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. పరేశ్ పెట్టిన ఈ ఫన్నీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పరేశ్ రావల్ సత్తా చాటారు.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించిన ఆయన విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూరరై పోట్రు’ సినిమాలో ఆయన నటించారు. ప్రస్తుతం ఆయన ‘హంగామ-2’, ‘తూఫాన్’, ‘ది స్టోరీ టెల్లర్’ తదితర చిత్రాలు చేస్తున్నారు.