ఎన్టీఆర్ బయోపిక్‌లో లింగం మామ!
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో ఓ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. బాలయ్య ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. తేెజ తెరకెక్కించనున్న బయోపిక్‌లో బాలయ్య 64 పాత్రలలో కనిపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనుండగా, సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. బుర్రా సాయి మాధవ్ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో లింగం మామగా, సోనాక్షి తండ్రిగా నటించి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్. ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ బయోపిక్‌లో నాదెండ్ల భాస్కరరావు పాత్ర పోషించనున్నాడని సమాచారం. పలువురు నటులని నాదెండ్ల పాత్ర కోసం పరిశీలించిన చివరికి పరేష్ వైపే టీం మొగ్గు చూపించిందట. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ఈ బయోపిక్ సినిమాను బాలకృష్ణ స్వయంగా సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలతో కలిసి నిర్మిస్తున్నారు.













