Paresh Rawal: అవార్డుల కంటే ప్రశంసలే ఎక్కువ
సినిమా రంగంలో అన్నిటికంటే గొప్ప అవార్డు ఆస్కార్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతీ ఒక్కరూ ఈ అవార్డు కోసం కలలు కంటారు. కానీ ఒక సినిమాకు ఆస్కార్ రావాలంటే అది మామూలు విషయం కాదు. దాని కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అంత కష్టపడినా ఆస్కార్ వస్తుందా అంటే అదీ చెప్పలేం. ఇదిలా ఉంటే ఈ ఆస్కార్ అవార్డుల విషయంలో లాబీయింగ్ జరుగుతుందని ఎన్నో విమర్శలున్నాయి.
ఆల్రెడీ ఈ విషయంలో ఎంతోమంది విమర్శలు చేయగా, ఇప్పుడు ఇండియన్ నటుడు పరేష్ రావల్(Paresh rawal) అవార్డులు, వాటి లాబీయింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అవార్డులు, పురస్కారాల కంటే దర్శకనిర్మాతల నుంచి వచ్చే ప్రశంసలే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. అందుకే తాను ఎప్పుడూ అవార్డులను కోరుకోనని, జాతీయ అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ జరిగే ఛాన్సుందని ఆయన చెప్పారు.
అవార్డులు ఎప్పుడైనా సరే నిస్పక్షపాతంగా వస్తేనే వాటికి విలువు గౌరవం ఉంటుందని, ఆస్కార్(Oscar) అవార్డుల విషయంలో కూడా లాబీయింగ్ జరిగే ఛాన్సుందని, కొన్ని రాజకీయల పార్టీలతో కలిసి చిత్ర నిర్మాతలు ఈ లాబీయింగ్ చేయాడానికి ప్రయత్నిస్తారని, అందుకే తనకు అవార్డుల కంటే ప్రేక్షకుల ప్రశంసలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.







