విజయదశమి కానుకగా పందెంకోడి 2
విశాల్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెనా స్టూడియోస్ పతాకాలపై ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పందెంకోడి 2. గంతలో విశాల్, లింగుస్వామి కాంబినేషన్లో వచ్చిన పందెంకోడి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పందెంకోడి 2 వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఠాగూర్ మధు తెలిపారు. విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యుమన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, నిర్మాతలు : విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా.













