దేవరకు పోటీ తప్పేలా లేదే
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే మొన్న ఏప్రిల్ 5న ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజై ఉండేది. సమ్మర్ హీట్ ను మరింత పెంచేలా కలెక్షన్లు కూడా దక్కేవి. వరుసగా ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి, రెండు లాంగ్ వీకెండ్స్ ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ లను దేవర మిస్ అయింది.
ఏప్రిల్ 5 నుంచి దేవర రిలీజ్ డేట్ ను మేకర్స్ అక్టోబర్ 10కి మార్చారు. దసరా టైమ్ కాబట్టి ఆ సీజన్ లో కూడా గట్టిగా కలెక్షన్లు సాధించొచ్చు అనుకుంటే ఇప్పుడు దేవరకు పోటీ మేఘాలు అడ్డొస్తున్నాయి. దాని వల్ల ఫ్యాన్స్ లో విపరీతమైన టెన్షన్ నెలకొంటుంది. ఈసారి దసరాను టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్ కూడా టార్గెట్ చేస్తుంది.
రజనీకాంత్ వెట్టాయన్ ఫెస్టివల్ సీజన్ ను కావాలనుకుంటే దేవరకు స్ట్రయిట్ క్లాష్ తప్పదు. అదే జరిగితే కేరళ, తమిళనాడులో తారక్ సినిమాకు ఇబ్బందులు గ్యారెంటీ. అజిత్ విదయ మయార్చిని కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమాలే. వీటితో పాటూ నాగ చైతన్య తండేల్ ను కూడా అక్టోబర్ టార్గెట్ గా దింపాలని చూస్తున్నారు మేకర్స్. ఒక రోజు గ్యాప్ ఇచ్చి అయినా దేవరతో పోటీ పడటానికి చిత్ర బృందం రెడీ అవుతుందని టాక్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ కూడా అక్టోబర్ 30న రిలీజ్ అని తెలుస్తోంది. అంటే దేవరకు, గేమ్ ఛేంజర్ కు 20 రోజులే గ్యాప్. ఇది బిజినెస్ పరంగా సేఫ్ అనిపించదు. రిలీజ్ కు ఇంకా చాలా టైముంది కాబట్టి ఈలోపు డేట్స్ మారే ఛాన్స్ లేకపోలేదు.













