Dangal: దంగల్ బ్యాన్ పై పాక్ మంత్రి పశ్చాత్తాపం

నితేష్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో ఆమిర్ ఖాన్(aamir khan) హీరోగా 2016లో వచ్చిన దంగల్(Dangal) సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మహావీర్ సింగ్ ఫొగాట్(Mahaveer singh phoghat) గా ఆమిర్ నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే అలాంటి దంగల్ సినిమాను ఆ టైమ్ లో పాకిస్తాన్ లో రిలీజ్ కానీయకుండా బ్యాన్ చేసింది. దంగల్ బ్యాన్ పై పాక్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్(Maryam Aurangzeb) పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
తాను పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయానికి సంబంధించి విచారకరమైన విషయం ఏదైనా ఉందా అంటే అది దంగల్ సినిమాను బ్యాన్ చేయడమేనని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను ఆ దేశ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడే దంగల్ రిలీజైందని, సెన్సార్ బోర్డుతో అదే తన మొదటి మీటింగ్ అని, కొన్ని రీజన్స్ ను చూపిస్తూ ఆ సినిమాను నిషేధించాలని వారు తనకు చెప్పారని ఆమె రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ లో తెలిపారు
వారు చెప్పగానే ఆ సినిమా చూడకుండానే దంగల్‌ను బ్యాన్ చేయడానికి ఆమోదం తెలిపినట్టు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత ఏడాదిన్నరకు దంగల్ చూసి, తాను ఆ టైమ్ లో తీసుకున్న డెసిషన్ తప్పని గ్రహించానని, ఆ సినిమా అమ్మాయిలకు ఎంతో స్పూర్తినిస్తుందని ఆమె తెలిపారు. దంగల్ సినిమా పాక్ లో రిలీజ్ కాకపోవడంపై రీసెంట్ గా ఆమిర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత జెండాను, జాతీయ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలని పాక్ సెన్సార్ సూచించిందని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో సినిమా అక్కడ రిలీజవలేదని ఆమిర్ పేర్కొన్నారు.