పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్…
విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాగల్. ఈ సినిమాతో కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి ఇండ్రస్టీకి పరిచయమవుతున్నాడు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ ఫై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యూత్‌పుల్ యాక్షన్ ఎంటర్టైనర్లో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నరేష్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ లు అందరూ చాలా బాగా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజ సజ్జ, కార్తికేయ, శ్రీవిష్ణు, నరేష్ కుప్పిలి, బెక్కెం వేణుగోపాల్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ తదితరులు పాల్గొన్నారు.













