మరో మల్టీస్టారర్‌లో రానా ?
తాజాగా కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్ మల్టీస్టార్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిసింది. పా.రంజిత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి, కాలా చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముందా బయోపిక్‌ను తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారని తెలిసింది. దీంతో పాటు అర్య-రానా కాంబినేషన్లో కూడా మరో మల్టీస్టారర్ రాబోతున్నట్టు సమచారం.













