MSG: మన శంకరవరప్రసాద్ గారు సెకండ్ సింగిల్ అప్డేట్
టాలీవుడ్ మెగాస్టార్(chiranjeevi) హీరోగా, హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad Garu). నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(Venkatesh) ఓ క్యామియో చేస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరంజీవి, అనిల్ కలయికలో వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ కు సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచుతూనే వచ్చింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి మేకర్స్ మీసాల పిల్ల(meesala Pilla) అనే ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయగా అది ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది.
కాగా ఇప్పుడు మన శంకరవరప్రసాద్ మూవీ లోని సెకండ్ సింగిల్ పై ఓ అప్డేట్ వినిపిస్తోంది. నవంబర్ నెలాఖరుకు ఈ మూవీలోని రెండో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సెకండ్ సింగిల్ డ్యూయెట్ గా ఉంటుందని, ఇందులో కూడా చిరూ తన గ్రేస్ స్టెప్పులతో ఆడియన్స్ కు ట్రీట్ ఇస్తారని అంటున్నారు. రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ సాంగ్స్ తో సినిమాను గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్లేలా అనిల్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.






