దీపావళి పండుగ కానుకగా ఓటీటీ లో ఎంటర్టైన్ చేయబోతున్న చిత్రాలు ఇవే..
దీపావళి.. దానికి తోడు వీకెండ్.. ఇలాంటి టైంలో హ్యాపీగా ఇంటి వద్ద కూర్చుని సినిమాలు ఎంజాయ్ చేయాలి అని ఎవరికి ఉండదు. అందుకే సినిమా ప్రియుల కోసం ఓటీటీ సంస్థలు పోటీపడి మరి సరికొత్త సినిమాలను, వెబ్ సిరీస్ లను పండుగ కానుకగా తీసుకువస్తున్నారు. తెలుగు చిత్రాలే కాక.. వీటిలో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్ లకు కొదవలేదు.
తాజాగా విడుదలై ప్రేక్షకులను మెప్పించి ఇప్పుడు ఓటీటీ లో రికార్డులను బద్దలు కొడుతున్న సత్యం సుందరం చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ముందుకు సాగుతోంది. హడావిడి జీవనశైలిలో మనం మర్చిపోయిన బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ .. చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపుతూ ఎమోషనల్ గా అలరిస్తోంది ఈ చిత్రం. ఇప్పటికే ఆన్లైన్లో భారీ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ చిత్రం దీపావళి సెలవులకు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క విక్రమ్ నటించిన తంగలాన్ చిత్రం కూడా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరోపక్క థియేటర్లో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో సహా మరికొన్ని చిన్న చిత్రాలు తమల ట్రై చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.మరి ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ లో వస్తున్న ఆ సినీమా, వెబ్ సీరీస్ లిస్ట్ ఏమిటో చూద్దామా..
నెట్ఫ్లిక్స్:
అక్టోబర్ 30- ద మ్యాన్హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
టైమ్ కట్ (ఇంగ్లిష్ సినిమా)
అక్టోబర్ 31-తంగలాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ వెబ్ సిరీస్)
నవంబరు 01-బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
డిస్నీ ప్లస్ హాట్స్టార్
అక్టోబర్ 30- విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 31-లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ సినిమా)
నవంబరు 01 -కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ సినిమా)
జియో సినిమా
అక్టోబర్ 31- ముబి ద సబ్స్టాన్స్ (ఇంగ్లిష్ సినిమా)













