Oscar2026: ఆస్కార్ 2026 వివరాలను వెల్లడించిన అకాడమీ
సినీ ప్రపంచంలో ఎంతో గౌరవంగా భావించే ఆస్కార్(Oscar) అవార్డులకు సంబంధించిన వివరాలను అకాడమీ(Academy) రీసెంట్ గా వెల్లడించింది. అకాడమీ తెలిపిన వివరాల ప్రకారం 2026 మార్చి 15న అకాడమీ అవార్డుల కార్యక్రమం జరగనుందని, అయితే ఈసారి అవార్డుల సెలెక్షన్ విషయంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్టు అకాడమీ అనౌన్స్ చేసింది.
పోటీలో ఉండే సినిమాల జాబితాను వచ్చే ఏడాది జనవరి 22న వెల్లడించనున్నట్టు అకాడమీ తెలిపింది. ఈసారి కొన్ని కేటగిరీల్లో ఓటింగ్ విధానంలో మార్పులు చేసినట్టు, నామినేట్ అయిన ప్రతీ సినిమానీ అకాడమీ సభ్యులు కచ్ఛితంగా చూడాల్సిందేనని పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఇంకా మంచి నిర్ణయాలు తీసుకునే ఛాన్సున్నట్టు అకాడమీ తెలిపింది.
ఈ ఇయర్ అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కొత్త కేటగిరీతో పాటూ, ఏఐ టెక్నాలజీతో తీసిన సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నామని, ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఎంతో ఘనంగా జరగనుందని, 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య రిలీజైన సినిమాలకు ఈ పోటీలో ఉండే అర్హత ఉంటుందని, మ్యూజిక్ విభాగంలో మాత్రం లాస్ట్ డేట్ అక్టోబర్ 15, 2025 అని అకాడమీ నిర్ణయించింది.






