ఆసార్క్ చరిత్రలో ఇది నాలుగోసారి!
ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ పురస్కారాల వేడుక కరోనా ప్రభావంతో వాయిదా పడింది. 2021 ఫిబ్రవరి 28న జరగాల్సిన ఈ వేడుకను ఏప్రిల్ 25న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ పేర్కొన్నారు. ఆస్కార్ చరిత్రలో పురస్కారాల వేడుక వాయిదా పడటం ఇదినాలుగోసారి. 1938లో వరదలతో, 1968లో మార్టిన్ లూథర్‌కింగ్ హత్య కారణంగా, 1981లో రోనాల్డ్ రీగన్ హత్యాయత్నం వల్ల ఆస్కార్ పురస్కారాలు వాయిదాపడ్డాయి. ఈసారి కరోనా వైరస్ వ్యాప్తితో వాయిదా వేశారు. వివిధ విభాగాల వారిగా నామినేషన్ల గడువును పెంచుతున్నట్లు ప్రెసిడెంట్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని పూర్తి చేసుకోవడానికి పెంచిన గడువు ఉపయోపగడుతుందనే నమ్మకముంది అని తెలిపారు.













