Oscar Nominations :ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా మరోసారి ఆస్కార్ నామినేషన్ల (Oscar Nominations) ప్రక్రియ వాయిదా పడిరది. జవనరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ (Academy) ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ (Los Angeles) లో మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే ఓటింగ్ వ్యవధిని పొడిగించాలని భావిస్తున్నాం. నామినేషన్లు ప్రకటించడానికి తేదీని మార్చాలని, సభ్యులకు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్(Bill Kramer), అకాడమీ అధ్యక్షుడు జానెట్ యాంగ్ (Janet Yang) తెలిపారు.













