ఒరేయ్ బుజ్జిగా ప్రీరిలీజ్ వేడుక
రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. విజయ్‌కుమార్ కొండా దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను కరీంనగర్లో నిర్వహించారు. నగర మేయర్ సునీల్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో బిగ్‌సీడీని ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణ హాస్యరసభరిత చిత్రమిది. రెండున్నర గంటలు నవ్విస్తుంది. అనూప్ అద్భుతమైన సంగీతాన్నందించారు. రాజ్‌తరుణ్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా సాగుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే చిత్రమవుతుంది అని చెప్పారు. నేను వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నా. తెలంగాణతో గొప్ప సంబంధం ఉంది. ఈ నెల 25న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావంతో ఈనెల 21 వరకు థియేటర్లు మూసివేస్తున్నారు. కాబట్టి తిరిగి ఓపెన్ చేయగానే విడుదల తేదిని ప్రకటిస్తాం అని నిర్మాత తెలిపారు.













