ఒరేయ్ బుజ్జిగా ఫస్ట్ లుక్ విడుదల
రాజ్‌తరుణ్, మాళవిక జంటగా నటిస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. విజయ్‌కుమార్ కొండా దర్శకుడు. కె.కె.రాధా మోహన్ నిర్మాత. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ రాజ్‌తరుణ్‌కి తగిన కథ ఇది. కుటుంబ సమేతంగా చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మాళవిక పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. అనూప్ స్వరాలు అందరికీ నచ్చేలా ఉంటాయి. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తామన్నారు. హెబ్బా పటేల్, నరేష్, పోసానీ, అనీష్, కురువిల్లా, సప్తగిరి తదితరులు నటించారు.













