ఆపరేషన్ దుర్యోధన తరహాలోనే ఈ సినిమా విజయవంతం
శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆపరేషన్ 2019. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై టి.అలివేలు నిర్మించారు. డిసెంబర్ 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రీరిలిజ్ వేడుక జరిగింది. ఆడియో సీడీని, టీజర్‌ను సీనియర్ నటుడు మురళీమోహన్, హీరో గోపీచంద్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ రాజకీయ నేపథ్య చిత్రమిది. ప్రజల్లో అవగాహన కలిగిస్తుంది. శ్రీకాంత్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. సందేశంతో పాటు రాజకీయాంశాల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది అన్నారు. ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించిన తీసిని సానిమా కాదిది. పాటలు, రీకార్డింగ్ బాగా కుదిరాయి. దర్శకుడు కరణం బాబ్జీకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విజయం విషయంలో విశ్వాసంతో ఉన్నాం అని శ్రీకాంత్ అన్నారు. ఆపరేషన్ దుర్యోధన తరహాలోనే ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని హీరో గోపీచంద్ తెలిపారు.













